బంధీని
ఎప్పుడైతే అనుకున్నానో నేనో నిరర్ధకాన్ని
నీవూ, నీ ప్రేమ లేకుండా అని .... అప్పుడు
నా ఈ ఒంటరి జీవితం లోకి
మంచితనం నిజాయితీవై వచ్చావు.
ఎంత కష్టమో .... నిజంగా
సూటిగా నీ కళ్ళలోకి చూడటం
నాలో ఉద్వేగం రక్త ప్రసరణ వేగం
కట్టలు తెంచుకుంటూ
ఓ అద్భుతం ఝలదరింపౌతూ
నేనేమీ నిస్వార్ధపరుడ్నని కాను.
బహుశ నా తలపై రాసి ఉండొచ్చు
నేనిలా ఇక్కడ ముగిసిపోవాలని
నా స్వార్ధం నా కోరికా మాత్రం
నీవూ, నీ ప్రేమ నా సొంతం కావాలని .... కానీ
ప్రేమ నాకు ఒక కొత్త పాటం నేర్పింది
దాని మార్గం లో నిలబడున్నప్పుడు
తప్పకుండా నేర్పుతుందని తెలిసింది.
ఈ సమాజం లో ఇక్కడ నేనొక బంధీని
నా బలహీనతల్లో ఇరుక్కుపోయి
ఎంతో శీతలమూ శున్యమూ అయిన
జీవితం సీసాలో చిక్కుకుపోయి
సీసా గొంతు లోంచి బయటకు రాలేక
నేను ఒక అశక్తుడ్ని బంధీని
నా ఆలోచనల ఆశల వలయంలో
తెలుగు టెలివిజన్ సీరియల్స్ లో లా
అనాసక్తికర సాగదీతల జీవితం లా
ఎప్పుడు వెనుదిరిగి చూసినా .... ఏదో వెలితి
అంతరాత్మ కాలుతున్న అనుభూతి
కాకపోతే మెల్లగా కాలుతున్నట్లు
నేను ఆ అసంతృప్తి మంటల్లో కాలిపోతూ
చల్లర్చేందుకు నీవు లేక
ఉద్వేగ భావనల్లో బూడిదైపోతున్నట్లుంటుంది.
ఎందుకో తెలియదు.
ఊహ తెలిసిన నాటి నుంచీ నేనీ చట్రం లో
నాకు తెలియకుండానే చుట్టబడి
ఇలాగే కొట్టుకుంటున్నాను.
ఈ ప్రపంచమంతా శూన్యంలా కనిపిస్తూ
నాకలలకు నా జీవితానికీ పొంతన లేదు.
అన్య అనితర భావనల్లో
అస్వస్తుడ్నై అనాసక్తుడ్నై కొట్టుకుంటూ
No comments:
Post a Comment