Wednesday, November 25, 2015

భయం



రాత్తిరిని చూసి భయపడను.
ప్రతి ఉదయమూ
సూర్యోదయం అవుతున్నంతవరకూ
రాత్రి లేని పగలూ లేదని తెలిసి

సమాధులు చూసి భయపడను.
జీవించి ఉన్నంత కాలమూ
పడమరను సమీపించాల్సొచ్చినా
జతవై నవ్వుతూ నీవు నాతో ఉంటే 



అంధకారం చీకటంటేనే భయం ....
వెలుతురు అగమ్యం జీవితమైన క్షణాల్లో  
అది పగలైనా రాత్రైనా
మంచే అయినా .... జతగా నీవు లేకపోతే

Tuesday, November 24, 2015

కరుణైనా కన్నీరైనా



ఎంత శక్తివంతమో 
కనులు 

ఏ స్త్రీ కైనా 

ఒక్క చూపు చాలు 

అన్యోన్యత, అంతరంగం 
తెలిపి .... 


మాటలు, అస్తిత్వం 
కోల్పోయే స్థితి 
ఉత్పన్నమయ్యేందుకు

Saturday, November 21, 2015

అమానుషత్వం చెరలో


నిశ్శబ్దం నిండిపోయిన ఓ శీతల రాత్రి .... క్షణాలు 
మంచుకొండల మధ్య అర్ధ ప్రాణంతో
చల్ల గాలి కి ఒణుకుతూ గడ్డకట్టుకుపోయిన శరీరం

ఎవరి ఉశ్వాస నిశ్వాసలు వారికే వినిపిస్తూ
నా వరకూ నేను చుట్టూ చూసే ప్రయత్నం చేసినా
చూపుకేమీ అంద లేదు .... అంధకారం తప్ప

మంచు గడ్డల్లో గడ్డ లా మారిపోక తప్పనిసరి స్థితేమో
శూన్యం చుట్టుముట్టిన మౌనాంధకారమే
అస్సహాయత ఒంటరితనమే ఎటుచూసినా

కొండల్లో కొండలా మంచులా గడ్డకట్టుకుపోవడానికి
అంగుళాలదూరంలోనే ఉన్నామని అర్ధం అయినా 
పరిణామక్రమం అగంతక ఆలోచనల్ని మార్చలేని అశక్తత 



ఇప్పుడు నేను కళ్ళతో చూడగలిగింది చాలా తక్కువ
భారంగానైనా నడవాలి ఏదో ఒకటి చెయ్యాలనుకుంటూ 
బయటపడాలి .... ప్రాణాల్ని నిలుపుకోవాలనే తపన

అగంతకుల చెర చిత్రవధలతో స్పర్శను కోల్పోయిన
సహకరించని అవయవాఉ .... అనాలోచితంగానే
మంచు తేలిన తటాకం వైపు నడుస్తున్నాను.

అప్పుడే చూసుకున్నాను స్వయాన్ని .... దూరం గా చావును
సాగదీస్తూ ఉన్న నా పరిగణాన్ని వారి మూలుగుల్ని వింటూ,
ఆలోచిస్తూ మానవ పరిణామ క్రమాన్ని .... ఆవేదన తో

Friday, November 20, 2015

అ న్యాయం



నలిపేసే చేతుల్లోని 
పరిమళం
రాజకీయపుటెత్తుల్లో సామాన్యుడు
మనుగడకై పోరాడుతూ
పరిణమించి
ఒక అందమైన పుష్పం లా

ఏదీ నాది కాదు



ప్రతిదీ అవసరం అని
అనుకోను .... ఇకపై
ఏదీ నాదని
ఇళ్ళూ, స్తలాలు
డబ్బు, సౌకర్యాలు
మూల్యతలు
సొంతం కానక్కర్లేదు.
ఆకలి తీరితే చాలు
చుట్టూ నిశ్శబ్దం పరుచుకుని
అద్దంలో ప్రతిబింబం
రోజు రోజుకూ మసకేసినా,

నాకు నీవు నీకు నేనూ
ఎప్పుడూ సొంతం కాలేదు.
కనీసం ఎప్పుడూ
నా, నీ పిల్లలు అనుకోలేదు.
మన అని,
అన్నీ అంతే
కాలం కరుగుతూ
జ్ఞాపకాలుగా మారిపోతూ
ఆ జ్ఞాపకాలే
చాలు అనుకుంటే చాలు.

చివరికి మిగిలేది మాత్రం
పదరూపం లో
అందంగా
అక్షరదోషం లేని భావనలేనేమో
ఈ మృదుస్పర్శలు
ఈ మౌనం వినడాలు
ఈ రంగులద్దిన పెయింటింగ్సూ
అనాలోచితంగా మనస్సును
పారవేసుకోవడాలు 
నిట్టూర్పుల్లేకుండా
త్యాగాలు చేయడాలు

Thursday, November 19, 2015

ఈదాలి తప్పదు



తెల తెలవారుతూ ఉంది.
నీ కళ్ళు కొలనులో ఈదుతూ
నా గుండెలపై ఆని
నీ ఆలోచనలు
చూపులు ఎక్కడో ఉన్నాయి
నా మేలుకొలుపు వినేందుకు

లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకోవడాలు
కలవాల్సిన కళ్ళు
శూన్యంలోకి చూస్తూ
తలుపులు తెరుచుకున్నాయి
గుండెలమీంచి
నీ తల పక్కకు జరుతూ

నీవు దగ్గరకు అతుక్కు పోతూ
అనూహ్యం గా మళ్ళీ
లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకోవడాలు
గాడమైన నీ శ్వాస శ్వాసకూ మధ్య
లొపలికీ బయటకూ
నా పేదవంచులపైకి జారుతూ కరుణ

లబ్ డబ్ లబ్ డబ్ శబ్దాలు రాలుతూ
నేనూ నీతో పాటు
దుఃఖసాగరం లోకి జారుతూ
కాలికి కాలం
చేతికి నోరూ అందని
మధ్య తరగతి సంసారం సాగిస్తూ మనం

గుర్తుంచుకుంటాను



వెన్నెల విరబూసిన, రాత్తిరిని
వెలిగిపోతున్న పూర్ణ చంద్రుడిని  
ఇలాగే గుర్తుంచుకుంటాను.
నీ కనుబొమ్మల్లోంచి చూస్తూ

ఈ ఉత్తేజపరిచే క్షణాలను
నాలో ప్రారంభమైన
ఈ ఉత్కంటభరిత అంతర్కెరటాలను
తుడిచి ముందుకు కదులుతూ

సూక్ష్మానుభూతి నొప్పిని 
దరికి రానివ్వకుండా
ఒక్క ఆనందోద్వేగ
జ్ఞాపకాలను మాత్రమే మిగుల్చుకుని

నీ నా సంబంధిత క్షణాలనూ
నిన్ను మరువరాదని
గుర్తుంచుకోవాలని అనుకుంటున్నాను.
నీ దయాగుణాన్ని నీ ప్రేమను 

కేవలం గ్రహించేందుకు
మాత్రమే కాదు
నీవు నా ఆత్మను స్పర్శిస్తున్నట్లు
అనుభూతిని పొందేందుకు

ముగింపు లేని ఆనందాన్ని పొంది
నీ జ్ఞాపకాలను వెంటేసుకుని
జీవితం ముగిసాకా కుడా జతగా పొందాలని 
ఏదో ఒకలా కాక, నా ప్రేమవు లా

Tuesday, November 17, 2015

గొణుగుడు



మళ్ళీ అదే వాగాడంబర 
అస్తిత్వం

అనుకుంటూ
గొణుక్కుంటూ

నాలో నేను
సంతోషంగా లేనని

అంతస్తు అంతరాలే 
కారణం కాదు

సర్వమూ

నేను, నా ఇష్టాలూ 
నా వ్యక్తిత్వం

నేనంటే నాకయిష్టమని 
లోలో గొణుక్కుంటూ

అసహజ ఆలోచనలు
కదలికలతో

వద్దు, కాదు కూడదని
అసంతోషం గా

నన్నేనోడించుకుంటూ

Sunday, November 15, 2015

ఎవరో పిలుస్తూ ....



కోల్పొయి శూన్యం లో .... నేను
క్రిందకు చూస్తున్నాను.
అడుగందని నరకం అగాధంలోకి
జీవకణ మరణం లోకి
వ్రేలాడుతూ

నా కాళ్ళ క్రింద వంతెన
సగం దాటి .... అప్పుడే
నన్ను నేను కోల్పోయింది.
ముందుకెలా వెళ్ళాలో
తెలియదు.

గురుత్వాకర్షణకు
వ్యతిరేకం గా
కదులుతున్నాను .... నేను
వేస్తున్న ప్రతి అడుగు లోనూ
తెగింపుంది.

అగాధాల్లొంచి
నా పేరును ఎవరో
అరుస్తున్నారు .... బిగ్గరగా
నేను పారిపోతున్నాను అని,
జీవితం పిలుస్తూ, నన్ను