ఏ కాగితంపైనా విదిలించని
అబద్ధాలే అన్నీ
నిజాయితీని చిందని ఈ సిరాలో ....
సంక్లిష్ట పరిస్థితులు మాత్రం
సూచించబడి .... కొన్ని తప్పులు
కొన్ని కర్మఫల దోషాలుగా
రక్తం రుచి మరిగిన
మనో వికారపు పరివర్తన లా
అస్పష్ట అక్షరదోష ప్రచురణలే అన్నీ
ఈ విపరీత భావనలు ప్రతిబింబిస్తూ
అక్కడక్కడా .... కొన్ని
పగులు అద్దాల చరిత్ర పుటలు
రెచ్చగొట్టని పెరిగిన అకారణ పగ లా
సమీపంలో .... చిరునామా లేని
ఒక అపవిత్ర శిశు సమాధి
No comments:
Post a Comment