నీలో ఏర్పడి నిన్ను కుదిలేస్తున్న బాద,
మరిక ముందుకుసాగలేనేమోననే బావన,
నీ కళ్ళు కన్నీళ్ళ బావి ...
శారీరకంగా మానసికంగా భరించలేని వ్యద.
నీకు శ్రేయోభిలాషులే లేరా,
నీతోనీవే వున్నావు,
ఎవరూ ముందుకు రాని ఎవరూ పలుకరించని జీవితం,
ఒంటరితనం ... వొంటరి పోరాటం.
అన్ని మార్గాలు ... అన్ని ప్రయత్నాలు విఫలమై నిరుపయోగమై,
భరించలేని అశక్తత నిన్ను నిర్వీర్యం నిస్సహాయుడ్ని చేసినప్పుడు,
బట్టలన్నీ ... మూటాముల్లే సర్దుకుని,
జీవన పయనానికి ముగింపు నిట్టూర్పేఅనిపించినప్పుడు.
అభిమానపడకు ... మరిచిపోకు ...... నేస్తమా!
నేనూ వున్నాను సభ్య సమాజంలో ... నీతోనే జీవనం కొనసాగిస్తూ,
నేనూ వొంటరినే ... ఐనా,
నీ బాధేమిటో తెలుసుకోవాలని పంచుకోవాలనుకునే హితుడ్ని!
ఏక్షణాన్నైనా నీ తోడుగా నిలబడే సామాన్యుడ్ని,
ఒకరిగురించి వొకరు ఆలొచించక తప్పని సహజీవనం సాగిస్తున్న నీ నేస్తాన్ని ....
....
బాగుంది సర్.. అయితే అక్కడక్కడా ఒత్తులు మిస్సయ్యాయి సరిచూసుకోగలరు. (చెప్పడం నా బాధ్యతగా భావిస్తున్నాను.. ఏమీ అనుకోరుగా).
ReplyDeleteఇకపోతే మీ బ్లాగును తెలుగు బ్లాగర్ల గుంపుల్లో చేర్చితే చాలామంది బ్లాగర్లు మీ బ్లాగును ఫాలో అయ్యే అవకాశం ఉంది. అలాంటి వాటిలో జల్లెడ, సమూహం, మాలిక, కూడలి, హారం లాంటి అగ్రిగేటర్లలో చేర్చుకున్నట్లయితే ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉండే తెలుగువారందరూ ముఖ్యంగా బ్లాగర్లందరూ మీ బ్లాగును ఫాలో అవుతారు. తగిన సలహాలు, సూచనలు ముఖ్యంగా బాగా ఎంకరేజ్ చేస్తారు.
మీరు ఇంకా ఇంకా బాగా రాయగలరు. ప్రయత్నించండి.. అభినందనలతో
శోభ