Friday, December 31, 2010

నీ ప్రేమ ......

... నిన్ను నిన్నుగా ప్రేమించి ... నీతో సహచరించడం భారం అయినా ...
పరవాలేదనుకునే తోడొకటుందా ...

ఇంకేం? ...

ఏ కొండలూ యెత్తైనవి కావు ... యే వాగులూ ... యే నదులూ నీవు దాటలేనివికావు ...

దేన్నైనా అధిగమించే శశక్తుడివి నీవు ...

చీకటి గుండెల్లో వెలుగు విస్పోటం లా ... యే సమశ్యా నీకు సమశ్య కాదు!

గుండెనిండా పీల్చిన గాలి ... నీ ప్రేమ
సర్వవేళలా స్వాగతించ దగిన నిస్వార్ద నిష్కళంక శక్తి ... నీ ప్రేమ ......

Wednesday, December 29, 2010

నమ్మకం నేస్తం!

అరుదైన ఆనందం,
నీవు నేనూ కలిసి గడిపిన అనుభూతి ...
స్నేహ సహజీవనం ... ఈ జీవితం,
గుండె లోతుల్లో వెలిగే ప్రమిద నీ స్నేహం

కలిసి గడిపిన సమయం,
వెచ్చని నీ సాన్నిహిత్యం ... మన గతం ...
నిరుత్సాహం, నీరసం కారు మబ్బులు ... వుక్కిరిబిక్కిరి అయినప్పుడు,
నా బుజం తట్టిన ... ఆ క్షణం,
మళ్ళీమళ్ళీ గుర్తుకొచ్చే ... నీ ఔన్నత్యం ...

కాలాలు గడవొచ్చు,
శులభ సాధ్యం కానిది ... నీ స్నేహం

స్నేహ హస్తమా ...

నీవు ... నా నమ్మకం,
నీవున్నావనేది ... నా ధైర్యం ...
నీవే ... నా సంపత్తివి,
నీవే ... నా నేస్తానివి ... సమస్తానివి!!!

Tuesday, December 28, 2010

గతం ...... ఖనిజ సంపద

గతం ...... అనుభవం, నేడు ...... రేపటి కోసం వదిలివెళ్ళిన అవకాశం ......
ఉన్నతమైన ఆశ ...... మహోన్నతమైన ఆశయాల కృషి ......
మనిషీ ......
ఏ బరువూ నీకు భారం కాదు
ఏ దూరమూ నీకు తీరం కానిది కాదు
సౌబాగ్యం, అదృష్టం, ఖనిజ సంపద ...... నీకు వారసత్వ లబ్ది
నీ ఆశయం ...... నమ్మకం బలీయం
నీ సౌబాగ్యం ...... సంకల్పం అమోఘం

Sunday, December 26, 2010

తెరిచిన గుండెల్లొ ...

మార్పు, ఎదుగుదల, గుణపాఠాల, అర్దం ... ప్రేమ ...
ప్రేమ ... జీవితానికి పరమార్దం.
పిరికివాడిలో దైర్యానికి ... కారణం ... ప్రేమ ...
ప్రేమ ... అభయ హస్తం.
తెరిచిన గుండెల్లొ ... ప్రేమ ... చెమర్చిన కన్నులస్వాగతాలు.
నమ్మకం, ఆశ, వమ్మైనా ...
పొరపాట్లు దొర్లి, దూరం పెరిగినా ...
బలోపేతం అయ్యేది ... ప్రేమ ...
ప్రెమే స్వాంతన, స్నేహం నిజం ...
ఎంత మదురం ఈ సహజివన సాంగత్యం!!!

Saturday, December 25, 2010

నేస్తమా!

నీలో ఏర్పడి నిన్ను కుదిలేస్తున్న బాద,
మరిక ముందుకుసాగలేనేమోననే బావన,
నీ కళ్ళు కన్నీళ్ళ బావి ...
శారీరకంగా మానసికంగా భరించలేని వ్యద.

నీకు శ్రేయోభిలాషులే లేరా,
నీతోనీవే వున్నావు,
ఎవరూ ముందుకు రాని ఎవరూ పలుకరించని జీవితం,
ఒంటరితనం ... వొంటరి పోరాటం.

అన్ని మార్గాలు ... అన్ని ప్రయత్నాలు విఫలమై నిరుపయోగమై,
భరించలేని అశక్తత నిన్ను నిర్వీర్యం నిస్సహాయుడ్ని చేసినప్పుడు,
బట్టలన్నీ ... మూటాముల్లే సర్దుకుని,
జీవన పయనానికి ముగింపు నిట్టూర్పేఅనిపించినప్పుడు.

అభిమానపడకు ... మరిచిపోకు ...... నేస్తమా!

నేనూ వున్నాను సభ్య సమాజంలో ... నీతోనే జీవనం కొనసాగిస్తూ,
నేనూ వొంటరినే ... ఐనా,
నీ బాధేమిటో తెలుసుకోవాలని పంచుకోవాలనుకునే హితుడ్ని!
ఏక్షణాన్నైనా నీ తోడుగా నిలబడే సామాన్యుడ్ని,
ఒకరిగురించి వొకరు ఆలొచించక తప్పని సహజీవనం సాగిస్తున్న నీ నేస్తాన్ని ....

....

సగటు మనిషి

మూడై, ఆరై, మారే రంగుల బూరె అందమైన సిగ్గు ...
అక్కడే ...
నీడల్ని ఏర్పరుస్తూ, కవ్వించే నవ్వు పువ్వు సొట్ట ...
ఎక్కడో ...
ఆకాశాన, మెరిసే మెరుపుల ఆశ ...
ఏమాత్రం ...
సువాసనలు వెదజల్లలేని, వాకిట్లోని కాగితం పువ్వు ...
ఉదయాన్నే లేచి ...
పగలంతా తిరిగి ...
రాత్రికి పడుకొవడమే జీవితం ...
ఆశలు, నిట్టూర్పుల మద్య ...
అందం, ఆనందం వేటలో సగటు మనిషి ...
అతని జీవితమంతా ...
పరుగు పందెం ...
అతను ప్రదమ స్థానం రాదని తెలిసీ ...
ప్రయత్నించే మధ్యతరగతి మనీషి!

Thursday, December 23, 2010

కరువొచ్చింది!

స్వాతంత్రం వచ్చింది ... అ సాంగీకశక్తులకా,  రాజకీయ రాబందులకా?
కరువొచ్చింది ... బారు బాబులకా,  భూకబ్జా దారులకా?
ప్రజస్వామ్యం వెక్కిరిస్తుంది ... ఓటు హక్కునా,  అసత్యాగ్రహాల దౌర్జన్యాలనా? 
కాళ్ళు పరిచిన యీ దారికంపలన్నింటినీ తప్పుకుంటూ ... ఆత్మహత్యల అతిధుల్ని అక్కున చేర్చుకుంటూ ... సామాన్యుని జీవితం రాజకీయ శకునిల చేతుల్లో పాచికలా ఇంకెన్నాళ్ళో ... 

Wednesday, December 22, 2010

పలుకరింపు మంత్రం

ఎవరో రావాలని పలుకరించి వినాలనే ...... అసహనం కుమిలి పోత
మనుషులకు కాబట్టే వచ్చి మానులకు రావనుకునే బాదలు కష్టాలు
బాగున్నారా! అనే పలుకరింపు మంత్రం కోసం ...... విచ్చుకున్న చెవులు వుపశమన వైద్యం
కష్టాలు వేగనిరోదకాలు ...... సుఖసాంగత్యం ప్రేమ కోరుకునే వెలుగువొత్తులు
కస్టసుఖాలు రాత్రి పగలు లంటివి కదా ...... ఎందుకు తెలిసీ యీ తత్తరపాటు 
గుందెల్లో నుంది పొంగే బాధ ...... కళ్ళల్లోంచి వెలువడే కన్నీరు ......
ఒకరికోసమే వొకరున్నారనుకునే తోడు కోసం ప్రాణి పడే తపన జీవితం
నీలాగే నేనూ! నీ బాద, నీ ఆనందం, నీ వెంటే నిన్నొదలలేని నేను ...... కలిసి పయనిస్తేనే తోడు
...... ఉపశమనం!

నిన్న రేపు నేడు

చరిత్ర పుటల రగ్గులో
... చలితాకిడికి తాళలేని
... తలదాచుకున్న నిశ్శబ్దం గతం!
కలల అలల వొత్తిని వెలిగించి
... మంచు ప్రమిదల తడి దీపాల ఆరాటంతో
... ఎదురు చూసే సంకల్పం రేపు!!
నమ్మకం నేల మంచు కురుస్తున్న ప్రస్తానం లో
... కాలానికిరంగులద్దుతూ చైతన్యమద్దం పడుతూ
... ఈ వుదయం ఎంత అద్బుత దృశ్య కావ్యం!!!  

Tuesday, December 21, 2010

వూబిలో దున్న! ... మనిషి

జీవితం బాటలో ...... Man Holes
...... ఎక్కి రాలేని అఘాదాలు, రహదారులు
...... Man Holeలో కి జారిన ... వూబిలో దున్న! ... మనిషి
...... అందులొంచి బయటపడలేని అశక్తత, అసహాయత ...... మనిషి తొలి తప్పు!
జీవితం బాటలో Man Holeలోకి మరోసారి జారడం!
...... బయటపడడానికి మార్గాన్వేషణ చేయడం! ...... మనిషి నమ్మకం!
జీవితం బాటలో అదే Man Holeలో కి మళ్ళీ మళ్ళీ జారడం ...... మనిషి అలవాటు.
...... క్షమించరాని పొరపాటు!  

Monday, December 20, 2010

నేనూ నవ్వాను నా నవ్వు నాకే విసుగనిపించేలా
...... గాంధీలా ......
సత్యాగ్రహాలు చేశాను, జైళ్ళకు వెళ్ళాను, పేదలగాధలు విని నిలువునా నీరైపోయాను
...... కానీ ......
తేడా ఎక్కడుందంటే, బ్రతికి లేడు
...... నాలాగా ......
బ్రాందీ తాగలేడు.
అందుకే అనిపిస్తుంది నాకు
...... అప్పుడప్పుడు ......
గాంధీజీ కంటే నేనే గొప్పేమో!