నాకు తెలిసింది చాలా తక్కువ స్వేదం ఇంకిన ముఖాలు ఆ అరిగిన పాదరక్షలు గోడలపై ఆ రాతలు ఏ శిల్పో అందంగా చెక్కిన అర్ధం కాని ఆ అపురూప చిత్రాలు శోధించాల్సిన రహశ్యాలు ఎన్నో కాలం ఖారాగారంలో నేను అనుభూతి చెందీ .... పాడలేని ఆలాపనల్లా
ఏదో అగాధం వెలితి ఎక్కడో ఉన్నట్లు ఏదో దూరం ఏదో విరామం అధివాస్తవికత వాస్తవికతల మధ్య మనస్సుకు, అంతరిక్షానికి మధ్య ఖాళీ .... ఒకటి బంజరు ఒకటి ఆకాశం లేని సత్యం గుండెలు హత్తుకోని నిజం తప్పించుకోలేని ఈ శూన్య అగాధాల లోతుల్లో ....
ఔనూ .... ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఈ విధ్వంసం? ఎందుకు నేను నశించిపోతున్నాను? ఎందుకు శూన్యమై పోతున్నాను? ఎందుకు ఈ అయోమయ అసంతులన భావనల్లో మునిగిపోతున్నాను?
ఎందుకు ఈ చిన్న కోరిక చిన్ని ఆశ
ఇప్పటికైనా నీవు నాకు దూరంగా పారిపోవాలి అని కనిపించనంత సూక్ష్మమై పోవాలని