Tuesday, January 29, 2013

నేనే మేధావిని



ఒక మేధావి మాట విను!
సాగటు మనిషీ .... ఇలా రా!
సాహచర్యం సహజీవనం అప్పుడేనా?
ముందు ....
నిలబడటం నేర్చుకో!
ప్రేమ చూపులు నవ్వులు ఎప్పుడూ ....
అందంగానే ఉంటాయి.
నేనున్నాగా నీకు సలహా ఇచ్చేందుకు ....
తొందరెందుకు?
ఆర్ధిక స్వాతంత్రం వివేకం నీలో పరిమళించనీ ....
ముందు
ప్రేమకు కామా పెట్టు ....
అప్పటి వరకూ,
ఆమె అస్పష్టపు మాటల్లో ....
విషపు తునకల్నే చూడు.
వాస్తవం చెబుతున్నా!
నన్ను నమ్ము ....
నీ అంతరాత్మను ....
చరిత్రనెరిగిన మేధావిని
వేటకుక్కలతో ఈ ఉల్లాసప్రయాణం-
రౌండ్ లో
మనసుకు శరీరానికీ గాయాలు పుష్కలం ....
అవసరమా!
గాయపడేందుకెందుకు అంత తొందర ....
నా మాట విను
సాహచర్యం సహజీవనం
సమయం, స్థలం .... నన్ను నిర్ణయించనీ!

నొప్పి



వికటించి
లోతు గాయం .... ప్రేమ 
వెండి వెన్నెల శరాల పానుపు 
ద్వేష వాయువు 
ఆత్మ లోకి నేరుగా .... 
ఉక్కిరిబిక్కిరౌతూ,

కలను కాను!?



ఉన్నానా? 
ఔనూ ఉన్నానా నేను .... ఉంటే, ఎప్పుడు జన్మించాను?
ఎవరిని నేను, ఎవరికి ఏమౌతాను.
లేక ఎవర్నీ, ఎవరికీ ఏమీ కానా .... నేను? 

నేను నేనేనా .... లేక, నేను నేనులో ఒక భాగాన్న, 
ఎవరి కల్పన నో నా, 
లేక నిజంగానే నేను వున్నానా? 
ఉన్నానో లేనో తెలియడం ఎలా?

ఎలా చెప్పను? 
జీవించే ఉన్నానని? .... జీవించే ఉన్నానా అని
నేను ఉన్నానని నాకే నమ్మకం కలగనప్పుడు ...
నన్ను నేను .... ఒక కల అనుకుంటే పోలా.... ఎవరో గుర్తించలేదని బాధపడే కన్నా?

చిరునవ్వు పలుకరింపు



నేనో సాయంత్రం వీధిలో నడుస్తున్నప్పుడు,
ఒక చిత్రం జరిగింది.
నన్నొక స్నేహితుడు కలుసుకున్నాడు.
.....
నేను .... దూరంలో ఉన్నా,
నా అడుగుల సవ్వడి వింటే చాలు
గుర్తించగలనని అంటూ,

నేనో ఉదయం కంప్యూటర్ ముందు కూర్చుని,
ఆల్గోరిథం లో మునిగిఉన్నప్పుడు
ఒక చిత్రం జరిగింది.
నన్నొక మితృడు పలుకరించాడు ....
.....
నేను .... దూరంగా ఉన్నా, పక్కన ఉన్నా ....
నా శ్వాస శబ్దం వెచ్చదనం తగిలితే చాలు
గుర్తించగలను అని,

నేనో రోజు .... కవిసమ్మేళనానికి వెళ్ళినప్పుడు,
ఒక చిత్రం జరిగింది.
నన్నొక నేస్తం పలుకరించింది.
....
నేను .... దూరంలో ఉన్నా
నా పదాల భావం వినిపించి,
చిరునవ్వు మెరుపు కనిపిస్తే చాలు .... పలుకరించేందుకు ఎదురొస్తానని,

Saturday, January 26, 2013

నిన్న మొన్నా అనుకోలేదు!



నిన్న, మొన్నా
తెలియదు నాకు
నువ్వు
నన్నింతగా ప్రేమిస్తున్నావని,
ఎన్నటికీ తగ్గని
ఎక్కడికీ వెళ్ళని
తోడు
నా నీడ నీవౌతావని,

అప్పుడు
వేడి రక్తం
యౌవ్వనం ఆత్మాబిమానము
స్వచ్చమైన హృదయం నీది
చిన్న వయసు
ప్రాపంచిక జ్ఞానం
తెలిసే
అవకాశం లేదప్పుడు

విధి రాత
గాలివాటం
జీవితం
రాలిన ఆకు
గాలికి కొట్టుకొచ్చి
చాలా దూరంగా,
విసిరేసి
కాల నిర్ణయం!

ఎంతో అరుదుగా
మాటలు వాడే
నీవు ....
నేను ఎదురైనప్పుడు
నేను వినాలని
నన్నానందింపచేసేందుకు ....
మాటల్లో ప్రియ భావాలు
ప్రేమ పదాలు పెదాలపై ....

నీవు .... ఇక్కడే నా పక్కన



నా మనస్సు.
నా జ్ఞాపకాలు లో,
ఆ రోజు నీవు నా నుండి వెళ్ళిపోయినా ...
నీవు నిజంగా ఇక్కడే ఉన్నావు.

నీవు వదిలి వెళ్ళిపోతున్నానని
అన్నావే కానీ ....
నీ గొంతూ వినిపిస్తూనే ఉంది.
నీవు నా పక్కనే ఉన్నావు.
నేను, నా భావాలు నిజమే అన్నట్లు
నీవు మాత్రం ఇక్కడే నా పక్కనే ....

నేను, అడ్డుకోను.
దూరంగా తోసెయ్యను.
తలపుల తలుపులు తెరువను,
కానీ నీ ఆక్రమణ ....
నా జ్ఞాపకాల సామ్రాజ్యాన్ని ఆతిక్రమిస్తూ,
ఇక్కడే నా పక్కన నా సాహచర్యాన్ని పాటిస్తూ ....

Friday, January 25, 2013

కృషి సాగరం



ఏకాగ్రత
బలం
సంయుక్త వర్ణం
అనుభవాల గుత్తులు
ఒక్కచోటే పేర్చడం

నిజం,

ఊపిరి
బిగించగలిగినంత సేపు
నిశ్శబ్దం పట్టుదలై
దాటేస్తూ
లక్ష్యసాగరం
ఇలలో

సహనం సమ్మతం


నీవు నన్ను సంతృప్తి పరిచేప్పుడు
నేను కోరుకునేది మాత్రం నిశ్శబ్దం
ఇంద్రియాల్ని కట్టడి చేస్తూ ఎదురుచూడాలి.
కోరిక రుచి లోతులు తెలుసుకునేందుకు,
నాకు మాటలు పదాలు .... గుసగుసలు
వివరణలు అక్కర్లేదు .... తెలుసుకోవాలని లేదు.
నీవూ నేనూ జీవిస్తుంది .... అనుభూతించడానికి,
అవకాశం దొరికినంవరకూ జీవం త్యాగించటానికి,
నీ గమ్యం .... సామర్థ్యరంగం లోకి అడ్డు రాను.
నీ చూపులు సారించినంత మేరా అడ్డుతగలను.
నేను ఇక్కడ ఉండానికి మాత్రమే ఇక్కడ ఉన్నాను.
పరుష పదాలు వాడను .... ఆలోచనల్ని వినోదించను.
నీవ్వొక పుష్పించే పువ్వులా ఇక్కడ ఉన్నావనుకుంటా!
నాకు నేను శరదృతువునై .... నీ లక్ష్యానికి సహకరిస్తా!
మన జీవితాలు మన గమ్యాలు రెండూ వేరు వేరు ప్రపంచాలు ....
పరిస్థితుల ప్రభావం .... సంఘర్షణ మినహా,
ఒకరితో ఒకరం పోరాడాల్సిన అవసరం లేదు.
జీవన అవసరానికి పక్క పక్కన సహచరిస్తే చాలు.
నీవు రాత్రివి అసాధారణ .... చల్లదనం వి
నేను ఆకాశంలో కరిగేందుక్ సిద్దంగా ఉన్న కారుమబ్బు ను
నేను కారణం కాలేను నీ ఆనందపరవశ్యతకు
ఘాడ నిద్రలొంచి ఉదయించాలి .... ఆనంద పారవశ్యాలు
నాకు అర్థం అయ్యేందుకు సమయం పట్టింది. 
ఇప్పటివరకు ప్రేమ భావం సమ్మతం వక్రీకృతం అయ్యింది .... నిజం!

Thursday, January 24, 2013

అది పదం కాదు .... పలికేందుకు



అది
మాటలాడని
బాష పలుకని పదాలు
చూడని చూపు
ఊపని తల .... భావం
అది
గుండె గుసగుస
దాయలేని వాస్తవం
నిద్దుర లేచిన
జ్ఞాపకాల చైతన్యం
వెలుగుమయమైన నిద్ర!

Friday, January 18, 2013

నా నమ్మకం ఆయుధం నీవు!



అద్భుత శక్తి, నా మనోధైర్యం, ఆయుధం నీవు!
నీవు నానుంచి ఎవరూ వేరుచెయ్యలేని సాధ్యం కాని .... ఆయుధానివి.
నా బలానివి .... గొప్ప నైపుణ్యానివి.

నా విశ్వాసం నమ్మకానికి మూలం నీవు!
నా పక్కన నీవుంటే ఇతరుల ప్రశంసలు ....
కలిసి నీతో ఉన్నంత సేపు నా జీవితం నా నియంత్రణ లోనే.

నీవు నా జీవితంలో కి వచ్చావు 
నన్ను నేను తెలుసుకోవడానికి .... నేను ఏదైనా చెయ్యగలనని, 
ఏమైనా కాగలనని .... ధనాత్మక ప్రపంచాన్ని ప్రభావితం చెయ్యగలనని నిరూపించావు.

నీవు నాలో బాగానివి .... నేను బ్రతికున్నంతకాలం! .... అదే నమ్మకంతో జీవిస్తా!
నా ప్రతి అడుగు పురోగమనం వైపే అని .... విజయాన్ని చూడగలనని, 
నా ఆలోచనల విత్తనాల సేద్యం .... నాకో గుర్తింపు తెస్తుందని నమ్ముతూ .... స్వేధిస్తున్నా!

కన్నీరు


నిశ్శబ్ద నిశీధి .... కన్నీరు,
ప్రేమ కోసం వెల్లడిస్తున్న నీ నివేదన .... కోరిక.
ప్రేమ లేని .... జీవితం, ఉప్పు లేని ఆహారం,
జ్ఞాపకశక్తి లేని కల,
వ్యాకులత లేని ఒంటరితనం.

చివరికి అవే నయం అనిపిస్తూ ....
మౌన గాంభీర్యం .... తడి, కన్నీరే మిగులుతుంది.

Thursday, January 17, 2013

ఎందుకో బ్రతకాలని లేదు!



ఆత్మహత్య చేసుకోవాలని మనసు ఊగిసలాడుతుంది.
బందువుల్నీ, స్నేహితుల్నీ, ఈ సమాజాన్నీ .... పక్కన పెట్టి, 
సామాజిక జీవనానికి, ఈ లోకానికి .... వీడ్కోలు చెబుతున్నా!
కేవలం ఒక అమ్మాయి కోసం ఇలా .... అర్ధాంతరంగా నా .... అనుకోకు!
ప్రేమ ముగింపు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది! అంతా.... విధి రాతే!!
నాకు ఆలశ్యంగా ప్రేమించాకే .... జ్ఞానొదయం అయ్యింది.
ప్రేమను పొందడం అంత సులభం కాదు, నిరర్థక సామెత కాదు జీవితం అని!
నా ప్రతిమాట వెనుకా బలమైన కారణం ఉంది. ఉద్రేకం మాత్రమే కాదు.
నేను ప్రేమించింది నిజం! నాది కాదు ఆమె అనేది నిజం అని తెలిసాక,
నేనేం చెయ్యగలను ఇంతకన్నా .... ఈ పని చెయ్యని వెన్నెముక .... పగిలిన గుండె....తో,

ఎందుకో బ్రతకాలని లేదు!



ఆత్మహత్య చేసుకోవాలని మనసు ఊగిసలాడుతుంది.
బందువుల్నీ, స్నేహితుల్నీ, ఈ సమాజాన్నీ .... పక్కన పెట్టి, 
సామాజిక జీవనానికి, ఈ లోకానికి .... వీడ్కోలు చెబుతున్నా!
కేవలం ఒక అమ్మాయి కోసం ఇలా .... అర్ధాంతరంగా నా .... అనుకోకు!
ప్రేమ ముగింపు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది! అంతా.... విధి రాతే!!
నాకు ఆలశ్యంగా ప్రేమించాకే .... జ్ఞానొదయం అయ్యింది.
ప్రేమను పొందడం అంత సులభం కాదు, నిరర్థక సామెత కాదు జీవితం అని!
నా ప్రతిమాట వెనుకా బలమైన కారణం ఉంది. ఉద్రేకం మాత్రమే కాదు.
నేను ప్రేమించింది నిజం! నాది కాదు ఆమె అనేది నిజం అని తెలిసాక,
నేనేం చెయ్యగలను ఇంతకన్నా .... ఈ పని చెయ్యని వెన్నెముక .... పగిలిన గుండె....తో,

అతి పెద్ద అబద్ధం!


ఆమె ప్రేమలో పడ్డాను.
ఆమె ఎవరో కూడా తెలియదు,
రోజులు, గడియలు గడుస్తూ ....
సముద్రం .... నా విశాల జీవితంలో,

నేను, ఆమెను పొందుతాను.
ఏ చిన్న అవకాశం దొరికినా, ఎంత శ్రమ అయినా,
ఆమె కోసం ఏమైనా చేస్తానికి సిద్దం నేను.
ఆమెను జీవన భాగస్వామిగా పొందడం కోసం!

ఆమె నా ప్రేమ .... నా జీవితం కూడా,
ఆమె నా జీవన సర్వస్వం,
ఆమెకు చెప్పాలని అనుకుంటూనే చెప్పలేను! .... ఎందుకంటే,
ప్రపంచంలోని ఎన్నో నిజాల మధ్య ఒక పెద్ద అబద్ధం నా జీవితం!


Tuesday, January 15, 2013

జీవితం ఆశ్వాదించు!



జీవితం
ఎన్నో మెలికలు,
మరెన్నో మలుపులు సమశ్యల మయం!
అందుకే .... కనే కలేదో పెద్దగానే కను
ఎందుకంటే,
నీకు ఎప్పటికీ తెలియదు.
నీ జీవితం నిన్నెటు తీసుకెళుతుందో ....
ఆనందించు ఆశ్వాదించు!
కాలం వయస్సు మీదపడి కభళించే లోపు!
శుభ ఉషోదయం నేస్తమా!

Monday, January 14, 2013

కష్టం!

కష్టం!


జీవించడం!
ప్రేమించడం మరీ 
ప్రేమను కోల్పోవడం మరీ మరీ 
కష్టతరం ఒంటరి ప్రయాణం .... ఎందుకంటే, 
ప్రేమను చేజారడం
జీవితాన్నీ కోల్పోవడమే!

నా ప్రేమ


ఎవరూ చూడని విధంగా
గుండె లో దాచుకున్న ప్రేమ
కళ్ళలో వెలుగుల చిరునవ్వులు పూస్తూ
ఏకాంతంలో కలిసినప్పుడు కూడా ఆమెకు తెలియని
నా ప్రేమ అమరం!

కానీ,
కొన్నిసార్లు రాత్రిళ్ళు
కలలో గమ్యం కోల్పోయి వెలుగు దూరని
కారడవుల్లో ఆమె ఒంటరి అయినప్పుడు,
మొగిలిపొదల సువాసనలు వెదజల్లింది .... నా ప్రేమే
నా ప్రేమ సుమ మకరందం!

కొన్నిసార్లు,
ఆమె గుండె అనారోగ్యంతో
శ్వాసించలేక పోయి, నీరసపడి
అప్పుడే ఉల్లాసంగా కొట్టుకోవడానికి
ఆమె గుండె నిబ్బరానికి కారణం .... నా ప్రేమే
నా ప్రేమ బాధల్లో ఔషదం!


సుదూర బంధం! .


ఓ బాల్య స్నేహం, ప్రేమై .... పల్లవించి,
జీవన బాగస్వామి అయ్యి,
విడివిడిగా జీవించాల్సిన పరిస్థితులు అవి.
పక్కరాష్ట్రంలో ఆమె
ఇక్కడ ఉన్న రాష్ట్రంలో నేను
నన్ను నేను చంపుకుంటున్నాను!

సౌలభ్యం పొందలేక పోతున్నాను.
ఏ వ్యక్తి సాన్నిహిత్యం అనురాగంలోనూ,
నా కోరిక .... నా మనోల్లాసం
నా చెలి చెంతనే అని .... ఎవరైనా చెప్పాలని
ఆమె, నా పక్కనున్నప్పుడే స్థిమితంగా ఉంటానని,
ఆమెనే చూస్తూ కాలం గడపడంలోనే అని,

ఆమె నా చెంతే ఉంటుందని
నన్నొదిలి వెళ్ళలేకే ఆమె అప్పుడప్పుడు వొస్తుందని
ఆమె నన్ను చూడటానికి వచ్చిన ప్రతిసారి ....
ఆమె కళ్ళు లోకి తదేకంగా చూస్తూ,
నన్ను నేను మర్చిపోవొచ్చని ....
ఎవరో నాకు చెప్పాలని,

కానీ .... వీడ్కోలు చెప్పక తప్పదు.
మళ్ళీ నేను ఒంటరిగా ఉండక తప్పదు
ఉండాలనుకోకపోయినా ....
అందుకే .... ఎప్పుడైనా,
కన్నీరు చురకత్తుల్లా నా ముఖంపై జారి
చురుక్కుమన్నప్పుడు
ఆమె వెళ్ళిపోయింది అని ఆనవాయితీగా.

నా కోరిక, నా అవసరం, నా ఇష్టం
ఆమె నాతోనే ఉండాలని.
ఆమెను నేను ఎప్పుడూ కొల్పోరాదని.
కావాలనుకున్నప్పుడు చూడాలని.
మళ్ళీ మళ్ళీ ఆమెను చుట్టుకొని,
ఆమె చేతిని పట్టుకుని .... ఎన్నో చెప్పాలని.
ఎప్పుడూ ఆమె కళ్ళల్లో నవ్వును చూడాలని.

ఆమెను
నా ప్రేమను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను.
ఆమె కోసం వేచి ఉండగలను ఎన్నాళ్ళైనా.
కేవలం కోరిక
నా ఆశ ఆవేదన మాత్రం,
కాలం మరింత వేగంగా కదలొచ్చుగా అనే.

Sunday, January 13, 2013

ప్రకృతి ప్రసాదం!



మట్టి వాసన .... వర్షం
ఉప్పదనం, తియ్యదనం కలిసి
పెదాల్ని తాకుతూ రుచి ....
నా ముక్కు, తల,
మెదడు తడిసి ముద్దౌతూ.
వసంతకాలపు వర్షం,
నా దుస్తులు నీళ్ళల్లో నాన్చినట్లు
కాలి వేళ్ళను తడిసిన గడ్డి ....
తాకి, ఒళ్ళు ఝలదరిస్తూ
వసంతం అందం పరిపూర్ణంగా ....
ఆశ్వాదించలేని స్థితి నాది.
పాఠ శ్రావ్యతను అర్ధం చేసుకోలేని
చెవిటి వ్యక్తిని!
ప్రకృతి ప్రసాదించిన
అద్భుతాలెన్నో డైల్యూట్ చేసి చూస్తున్నట్లు
ఇక్కడ నేను .... ఆమె పక్కన అండగా
ఒక జీవిత కాలం తోడుంటానని మాటిస్తూ ....

మనుగడకై పోరాటం!



తొలి విజయం
ఫలితం .... ఆశ్వాదించేందుకు
మనసు పడే తపన
శారీరిక శ్రమ .... కష్టం
స్థిరత్వం తో కూడిన పోరాటం
జీవితం!
కళ్ళారా చూడాలని,
కడుపారా తినాలని,
వీనుల విందుగా వినాలని,
నా కాళ్ళమీద నేను లేచి నిలబడాలని,
అతస్థులు ప్రాకాలని,
తలెత్తుకుని నడవాలని,
అందకుండా పరుగులు తీయాలని,
గర్వపడేలా జీవించాలని,
గుండెల నిండా శ్వాసించాలని,
స్వర్గాన్ని చేరాలని .... నీ తోడు 
నీ సాహచర్యం నీడగా .... నేస్తమా!

Saturday, January 12, 2013

యాంత్రిక జీవనం


ఒకేలా ఆలోచించే
నీవూ, నేనూ కలుస్తామని
ఆలోచనల భారం అధికమై ...
అప్పుడప్పుడూ
కాసింత విశ్రమించాల్సొస్తే 
ఒకరికి ఒకరు
తోడు అవసరమని
మనం ఒకటవ్వాలని 
కానీ,
మనం ఎప్పుడూ
ఒకరి నొకరం
అర్ధం చేసుకునే
ప్రయత్నం చెయ్యలేదు.
ఓపిక నశించి
నిర్వీర్యం అయ్యే క్షణాల వరకూ
ఆశలు కన్నీళ్ళై కారేవరకూ

నా గుండె
మండుతుంది
రగులుతుంది
నాలాగే ఆలోచించే
నిన్ను
నీ ఆవేశంలో
కొట్టుకుపోతూ చూసాక
ఇన్నాళ్ళూ ఎందుకు
గమనించలేదూ అని 
నీ విశిష్ట మనస్తత్వాన్ని
నా మనో ఆశయాన్నీ
ఇప్పుడు
నా ప్రేమను
నేనే నమ్మలేకపోతున్నా ....
నిజమా అని.

అడవులు,
కొండల్లో కురిసిన
వర్షం ప్రవాహమై
మానవత్వాన్నే తడుపుతున్నట్లు
మబ్బులు
ఆకాశంలో పరుగులు తీస్తూ
మనిషి మనసుతో
పలుకరిస్తూ పోటీ పడుతున్నట్లు
నిన్ను గమనించిన .... నాలో
ఈ చిరునవ్వుకు
అర్ధం వెదకకు 
మనం కలిసి కూర్చుందాం!
పక్కపక్కన,
ఎత్తైన ప్రదేశంలో .....
ఒకే దిశగా చూద్దాం!
కలిసి కలలు కందాం ....
మరిచిపోవొద్దు ప్రియా!
లక్ష్య సాధనకు తొందర తప్పదని.

అగ్ని గోళం!



మంటలు
నీటితో ఆర్పలేని మంటలు
మండుతూ
మండుతూ .... నా ఆత్మను కాల్చేస్తూ

నీ ప్రేమ
మండుతున్న జ్వాల
అది మండుతూ రగులుతూ
నా ఆత్మలో

ఈ నా ప్రేమ
ఒక కోరిక
ఒక ఉద్వేగం
అనుక్షణం అగ్ని గోళం

జ్వాలలు
జ్వాలలు భగభగమంటూ
రగులుతూ కాలుతూ
బూడిద చేస్తున్నట్లు నా ఆత్మలో

|| స్వాగతం! ||



అయాచితంగా ముఖంపై
దోబూచులాడే చిరునవ్వు
కొన్నిసార్లు .... అన్నీ సజావే
అనుగుణంగానే ఉన్నాయి ..... అని.
మనసు
ఉల్లాసం దాచుకోలేము.
ఉత్సాహం ఉలికులికొస్తుంది.
మాటలు, కదలికలు .... నిట్టూర్పులు అయి,
అదో ప్రత్యేక స్థితి.
ఆహ్లాదం .... మనస్థితి!
బహుశ ....
ఏ అత్మీయ స్నేహమో,
ప్రేమ అనుబంధమో,
చేరువ అవుతున్నందుకే!
పట్టలేని ఆనందం!
చిరునవ్వు సుగంధాలై .... విరియడం!
....
ఎవరో
వ్యక్తిని కలుస్తున్నందుకు
ఆ సాన్నిహిత్యం,
ఆ ప్రేమ, సాహచర్యం వల్ల
జీవితం వెలుగుమయం ....
అవుతుందనే నమ్మకం ....
ఔనూ ఊహిస్తున్నావా?
ఆ ఒక్కరు ఎవరో ....
....
ఆ ప్రత్యేక వ్యక్తివి నీవే!
ఈ పూస్తున్న నవ్వు పువ్వులు
నీ ఆలోచనలే!
ఈ భావం, ఈ ఆవేశం ....
వేచి చూడడానికి కాదు!
జీవన భాగస్వామివిగా ....
రాబోతున్న నిన్ను స్వాగతించడానికి!

జీవితం ఒక దివ్యానుభవం



నిశ్శబ్ద రహదారుల వెంట నడుస్తూ .... నేను,
సమాధానాలకు ప్రశ్నలు ఆలోచిస్తూ ఉన్నా
దూరంగా కలిసినట్లుండి
సమాంతరంగా సాగే భూమ్యాకాశాల మధ్య
దూరం కొలవాలని,
రహదారి పక్కన కుంటలు
నీళ్ళల్లో .... ఆకాశాన్ని చూస్తూ
ఆశ్చర్యకరమైన ఆలోచనలు.
వేడికి తట్టుకోలేక,
శరీరాన్ని దాచుకున్న పసువులు,
పిచ్చి జమ్ము మొక్కల మధ్య
అక్కడక్కడా కలువ పూలు,
అంతులేని ఆశలు .... జలచరాలు,
అనంత ఆపేక్షలు స్నానాలాడుతూ ....
మనసుకు నచ్చిన ఆశలు కొన్ని
చిత్రాలుగా .... నా మెదడులో జ్ఞాపకాలై,
ఆపుదల లేని కాలం అవిశ్రాంత పరిభ్రమణం!
 కుంటల్ని దాటి కదులే కొద్దీ
విసర్జిత పదార్ధాలు పారవేసే స్థలం
ఆ చెత్తను ఈగలు, దోమలు, బొద్దింకలు
పురుగులు మయమై
ఆ చెత్తను బయో మాస్ అనలేను.
అలా అని మానవత్వం
మంటకలిసిన చెత్త పదార్దం అనలేను.
నా దృష్టిలో జీవితం
అందమైన ఓ ఉద్యానవనం!
అలానే నడుస్తూ పోతే,
అటూ ఇటూ కర్రలు కట్టిన చక్క వంతెన
పక్కనే ఒక వీధి
ఆ వీధి నిర్మానుష్యంగా,
ఇంకొక వీధి అర్భాటం, హడావుడీ తో సంతోషంగా ....
పిల్లగాలులు తాకి మంచు చినుకులు
గట్టిగా నన్ను తట్టి .... ఝలదరింపు
ఆకాశం మబ్బుల మయమై
మబ్బులు పడమటి దిశగా
కదులుతూ కమ్ముకొస్తూ ....
దూరంగా .... శ్మశానంలో
చెలరేగిన మంటల ప్రేలుడు శబ్దాలు
ఎవరో వెంటాడుతున్నట్లు
కల్మషంలేని యాంత్రిక ధర్మాలు
మనిషి ఎంతగానో పరిశోధన చేసి
ఒప్పుకున్న భ్రమరాహిత్యపు మృగభావనలు
అయినా నా ఉద్దేశ్యంలో
జీవితం ఒక అద్భుత అవకాశం!

Friday, January 11, 2013

|| ప్రకృతి .... అమ్మ! ||



అమ్మ 
ప్రకృతి లా ....
అమరుస్తూ అన్నీ 
ఏదైనా, 
ఎప్పుడైనా, 
ప్రకృతి అమ్మ వొడి!

Wednesday, January 9, 2013

|| ప్రియ భావమా ||


నీవే నా కలలో
నా భావనల్లో
ఈ ఎదురుచూపులు
నీ కోసమె ....
ఎంత మోసినా
భారం అనిపించని
భారం నీవు.
కాపాడుకోవాలనిపించే
భావం నీవు.
నా గుండెల్లో దాగిన
నా ప్రేమ రాగం నీవు.
అందుకే చెబుతున్నా!
నీ ఆత్మను మనసును
నిబద్దించకు!
ఉల్లాసంగా ఎగురనియ్యి!

కల్మషంలేని
నీ అనురాగాన్ని
కోరుకుంటున్నా!
నీ, నా ముద్దు ముచ్చట్ల
అద్భుత ఘటనల
సమాగమాన్ని ....
ఆశిస్తున్నా!
నీవు నా సహచరివి.
హృదయ సామ్రాజ్య అధిరాణివి.
అందుకే నేనూ
నా ఆత్మను మనసును
ఉల్లాసంగా ఎగరనిస్తున్నా!
మనకు మనం చాలు
మనోభావాలు అంగీకరిస్తే!

పడిపోతున్నానేమో 
తొందరపాటులో
సరిదిద్దు .... అవసరమైతే
ఎప్పుడైనా
ఊహల విహంగాలమై
స్వర్గ సీమలకు
ఎగిరొద్దాం!
ఎక్కడైనా
నీవూ నేనూ ఉండేందుకు
గూడును
స్వర్గ దామం వెతుక్కుందాం!
దాపరికం లేని భావనల్లో
నగ్నంగా నర్తించేందుకు
నీ అంగీకారం నా అంగీకారం అయ్యిన
లక్షణాలు, మనోహర క్షణాలు
అస్వాదించేందుకు
ఫలవంతం అయ్యేందుకు!


|| నమ్మకం! ||

|| నమ్మకం! ||

ప్రకాశించకపోయినా,
సూర్యుడ్ని
తిరిగి పొందలేకపోయినా,
ప్రేమను
మౌనంగానే ఉన్నా,
దైవాన్ని ....

నమ్ముతున్నా!

Tuesday, January 8, 2013

|| ఎలివేషన్ ||



చూస్తున్నాను
అబద్దాల అంచుల్ని
నమ్మించాలని చూస్తున్న నీ ముఖభావాల్ని
వింటున్నా
వంచన పరాకాష్తను
తేనె పూసిన తియ్యని నీ మాటల శబ్ద తరంగాల్ని ....
నేను పక్కన ఉంటే నమ్మకం తోడుగా ఉన్నట్లే ఉంది అన్నావు.
నమ్మాను .... నిజమని
నీ ఆశల ఆకాశ హర్మ్యం ఆఖరి అంతస్థును
చేరేందుకు
ఎక్కిన మలి మెట్టును అవుతాను నేను అని అనుకోలేదు 
నీవు అన్నావు ఆనాడు .... నాకోసమే జీవిస్తున్నాను అని
నేను లేని మరణమే మేలు అని 
ఆనాటి నీ చేష్టలు
నమ్మిన నా అమాయకత్వం పిచ్చి ప్రేమ గుర్తుకు వొస్తూ
విరహ వేదన, సిగ్గు .... నన్ను .... లోలో చంపేస్తుంది నాలో.

( 09/JAN/2013 ---- 6.00AM )

Monday, January 7, 2013

ఉక్కిరిబిక్కిరౌతున్నా


ప్రకృతిచే విసర్జించబడి
నేనిక్కడ మాసిపోయి మెలుకువలో
నన్ను నేను ప్రశ్నించుకుంటూ ....
మరెంతకాలం ఇలా అని
సాధారణ మనిషిగా మారేదని
ఎంత సేపని .... నొప్పితో జీవించేదని
నీవెందుకు నాపై .... ప్రేమ వర్షమై కురువవు అని,

మొదటి సారి .... నిన్ను చూసినప్పుడు,
భూమ్యాకర్షణ శక్తి నన్ను పట్టుకోలేక
అంతకు మించిన ఆకర్షణ లా
జీవన సంతులనానివి లా కనిపించావు.
పెదవి విప్పి .... ఒక్క మాటైనా మాట్లాడకుండానే,
అందంగా విప్పారిన కళ్ళు .... రెపరెప లాడుతూ 
గుసగుసలు అద్భుతాలు ఎన్నో .... నీ గురించే,

రోజువారీ విషయాలు తలలో .... నీతో పంచుకోలేక, చెప్పుకోలేక
నీకు నా ప్రేమపై నమ్మకం లేదని తెలిసి
నన్ను నేనుగా వేసుకునే ప్రశ్నలు .... ఎన్నో
ఎన్నాళ్ళీ బాధాకరమైన ఈ ఒంటరి స్థితి అని,
ఆ రోజు నీవు ఇచ్చిన షాక్ రియాక్షన్
నేను "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అన్నప్పుడు
ఆ చూపుల నిర్లిప్తభావాలు మరువ లేను.
కానీ నీ ప్రేమలోనే ఉన్నాను .... మార్చలేక నన్ను నేను.

నేను నీ ముఖం లోకి చూస్తున్న ప్రతిసారీ .... ఎందుకో,
నా గుండె వేగంగా మరింత వేగవంతంగా కొట్టుకుంటూ
లెక్కించలేనంత వేగంగా శబ్దం .... శ్వాస వేగంగా
నీతో మాట్లాడే అవకాశం దొరికినప్పుడు
నాకు నేను వేరే లోకంలో ఉన్నట్లు,
అక్కడ, ఎలాంటి సంకోచాలు దాపరికాలు లేనట్లు,
కానీ ....
నాకు తెలుసు ఆ భావనల్ని .... నా కలల్ని
మినహాయిస్తే .... అంతా కృత్రిమము, నకిలీయే అని.

సమాధానం తెలిసీ తెలియనట్లు ఇలాంటివే
నా తలలో .... ఎన్నో ప్రశ్నలు!? కదులుతూ, పరుగులు తీస్తూ,
నాకు నేను విసర్జించబడి .... తల వాల్చినప్పుడు,
పిచ్చి ఆలోచనలు, పీడ కలలు
కళ్ళను కప్పేసిన .... గుండె స్పందనలు
నన్ను గానీ నీవు ప్రేమించ లేకపోతే
దూరంగా వెళ్ళిపో అని, నీతో చెప్పలేక చెప్పాలని
మరణించినా ఫర్లేదు వదిలెళ్ళు .... నా గుండెను అని.

పరిపూర్ణ ప్రేమ!

పొందు కోసం వెదుకుతున్నా 
ప్రేమసంపదలా .... నా కోసమే అన్నట్లు
ఇన్నాళ్ళకు కనిపించావు. 
రూపవతిలా నీవు

నన్ను, నీవు .... నిన్ను, నేను 
బలోపేతం చేసుకునేందుకు 
మరోరకంగా బలహీనులమై ఒకరిపై ఒకరు ఆధారపడేందుకు 
ఒకరి అబిలాష కోసం ఒకరం 
ఆవిరై, ఆత్మల తృష్ణను తీర్చుకునేందుకు ....

నాకు 
నీ కోరికల ఆంతర్యం తెలుసు 
నీకు నా ఉద్దేశ్యం మనోభావాలు తెలుసు 
నాలో అగ్ని నీవు నీలో అగ్ని నేను 
అస్థిమితంగా ఆబగా ఇద్దరం
....

ఒకరి కళ్ళలోంచి ఒకరు గుండెల్లోకి చూసి 
మండే మోహాగ్ని గుండాల్ని .... 
అర్ధం చేసుకుని, ఉపశమనం కోసం
ఆత్మల్ని స్పృశించుకుందాం! 
మండే ఆ బడబాగ్నిని చల్లార్చుకుందాం తోడుగా నిలిచి!

Sunday, January 6, 2013

పగిలిన పసి హృదయం!



చిన్ని హృదయం
బాధపడుతోంది నొప్పితో
మతిస్థిమితాన్ని కోల్పోయి
పగిలిన పసి గుండె
మరణాన్ని కోరుకుంటోంది.
చిదిమేసిన చిన్నారి హృదయం
ఏడుపులోనే ఉపశమనాన్ని పొందుతూ
తియ్యని బాధను
సలుపుతున్న హృదయ నివేదనను
నీతో చెప్పాలని, నీవు చూడాలని
పగిలి ముక్కలై స్థిమితపడలేని
పసి హృదయం
తనలో లోలో తానే కుళ్ళిపోతోంది ....
నీ ప్రేమ కోసం .... నీ స్పర్శ కోసం!

Saturday, January 5, 2013

|| ప్రేమే నేరం! ||



చరిత్ర లో అక్షరాలు .... గతం వాస్తవాలు.
ప్రేమ బిడియపు, తొలిచూపు ప్రణయాలు.
ఇష్టాలు, అవసరాలు సరిగ్గా ఒకేలా ప్రేమికుల్లో .... ఆనాడు
అనుకున్నాక అన్నీ సర్ధుకుపోయే అభిప్రాయాలు వారివి.

లోపరహితం గా తొలి కలయికలు .... జరగేవి.
దొరకని దొంగతనం .... ప్రేమ తొలి ముద్దు పట్టుబడని నిజాలు.
ముచ్చట్లు, షికార్లు, ముద్దు మురిపాలు బంధాలయ్యేవి .... ఆనాడు! 
క్షణమైనా ఒకరినుంచి ఒకరిని .... విడదీయలేనంతగా,

ఆమె, అతను .... ఒకరి అడుగులో ఒకరు .... జీవితం రహదారిలో
మనసులు కలిసి ఎదగడం .... పిల్లల్ని, పిల్లలపిల్లల్ని వీక్షించడం,
ఏ ముంగిట్లో చూసినా నవ్వులే .... జీవితాల్ని కథలుగా చెప్పడం,
చివరికి .... మరణానంతరం, పక్క పక్కన సమాధులై మిగలడం .... సంసారం!

ఎప్పుడూ ఒక్కరుగా
కలిసి,
ఎప్పటికీ విసుగు చెందని సాహచర్యం అది.
అందరికీ తెలుసు కారణం ప్రేమే అని నేరం ప్రేమదే అని,

Tuesday, January 1, 2013

ప్రేమ



మనస్సు మరియు గుండె 
రెండింటి జంట భావన 
ప్రేమ .... చూసే కళ్ళకు 

మరీ .... పరిశీలనగా చూస్తే 
దాని అర్ధం
లేని దాని కోసం గుండె చెందే ఆరాటం!

నవ్వకు దయ చేసి!



నేను అసహ్యించుకుంటున్నాను.
నీ ముఖం మీద నవ్వును,
నన్ను దుర్బలుడ్ని చేస్తున్న .... నీ ప్రతి చిరునవ్వును,
అసహ్యించుకుంటున్నాను.
మోసపు చిరునవ్వును, నిన్ను అసహ్యించుకోలేకపోయిన నా దౌర్బల్యాన్ని!

నేను నిన్ను ప్రేమిస్తున్నా!



ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు,
అతన్ని అతను కోల్పోయాడు.
ఒక పగిలిన హృదయం బాధతో రోధిస్తుంది
ఇక ఎప్పుడూ అది అతకదేమో అని